కెరీర్లో ఎన్ని హిట్లు వచ్చినా మరిన్ని విజయాలు కోసం తాను తహతహలాడుతూనే ఉంటానని హీరోయిన్ కియారా అడ్వాణీ చెప్పింది. చాలు అని సరిపెట్టుకునే వ్యక్తిత్వం తనది కాదని స్పష్టం చేసింది. తనను తాను మెరుగుపరుచుకుని మరింత బాగా నటించేందుకు ప్రయత్నిస్తుంటానని తెలిపింది.
"మరిన్ని హిట్లు కొట్టాలనే తపనతో ఉంటాను. ఇంతటితో సంతృప్తి చెందాను అని అనుకునే వ్యక్తిని కాదు. నన్ను నేను నిరూపించుకోవడానికి ఎప్పుడూ కష్టపడుతుంటాను. ప్రస్తుతం ప్రయాణం సాఫీగానే సాగుతోంది. ఇలానే కొనసాగాలని అనుకుంటున్నాను"