వెస్టిండీస్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు. విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ టీ20 కెరీర్లో వ్యక్తిగత అత్యధిక పరుగులు (94) నమోదు చేశాడు. అయితే ఈ ప్రదర్శనపై బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. బిగ్‌బీ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలోని ఓ డైలాగ్‌తో కోహ్లీ ఆటిట్యూడ్‌ను వివరించాడు.
"మీకెన్ని సార్లు చెప్పాలి. విరాట్‌ను టీజ్ చేయవద్దని. కానీ మీరు నా మాటల్ని వినలేదు. చూడండి ఇప్పుడు కోహ్లీ ఏ రకంగా స్పందించాడో. అలాగే వెస్టిండీస్ ఆటగాళ్ల ముఖాలు చూడండి. కోహ్లీ వారిని వణికించాడు."
-అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ హీరో