'వాట్ ఈజ్ హాలీవుడ్. వి ఆర్ హియర్ ఎట్ టాలీవుడ్. డోంట్ కంపెర్' అని అంటున్నారు అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున. ఆయన ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వైల్డ్‌డాగ్'. హైదరాబాద్‌లో జరిగిన బాంబు దాడులను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో 'వైల్డ్‌డాగ్ మిషన్ అకంప్లీష్డ్' కార్యక్రమాన్ని చిత్రబృందం ఏర్పాటు చేసింది. తమ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన మీడియా మిత్రులు, సినీ ప్రియులకు ధన్యవాదాలు తెలియజేసింది.
'"నేను చేసే ప్రతి చిత్రాన్ని ఆదరిస్తూ.. నా వెంటే ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ‘వైల్డ్‌డాగ్’పై ప్రశంసల వర్షం కురిపించిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్యూ. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న కారణంగా ‘వైల్డ్‌డాగ్’ రిలీజ్ చేయాలా? వద్దా?అని మేమంతా ఆలోచించాం. మంచి కథ ఉంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి చూస్తారని నమ్మాం. విడుదల చేశాం. అదే మాదిరిగా కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. మాకెంతో సంతోషంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా నా అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎలాంటి పాత్రల్లో నటించినా సరే ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఎప్పటికీ నేను వాళ్లకి రుణపడి ఉంటాను"
- నాగార్జున, కథానాయకుడు.
మీకు వచ్చిన ఉత్తమమైన ప్రశంస?
నాగార్జున: 'ప్రతి భారతీయుడు తప్పకుండా ఈ సినిమా చూడాలి' అని చాలామంది అంటున్నారు. అదే నాకు ఉత్తమమైన ప్రశంస.
అరవైయేళ్ల వయసులో కూడా నాగ్‌కు ఇంత రిస్క్ అవసరమా అని అందరూ అంటున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం?
నాగార్జున: నా లైఫే రిస్క్. రిస్క్‌లు తీసుకుంటూనే ఉంటాను.
'వైల్డ్‌డాగ్' సీక్వెల్ ఉందా?
నాగ్: సీక్వెల్ అనేది ఏమీ లేదు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం.
విజయ్‌వర్మ పాత్ర చేయడానికి ముఖ్య కారణం?