తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అదే మీరు నాకిచ్చే విలువైన బహుమతి: తారక్ - NTR birthday

బుధవారం (మే20) తన పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపొద్దని అభిమానులను కోరారు జూనియర్ ఎన్టీఆర్. అధికారిక ఆంక్షల వల్ల 'ఆర్​ఆర్ఆర్' నుంచి టీజర్ కానీ, ఫస్ట్​లుక్ కానీ విడుదల చేయడం లేదని స్పష్టం చేశారు.

తారక్
తారక్

By

Published : May 18, 2020, 5:18 PM IST

బుధవారం (మే20) జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. తమ అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా ఉండదు. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు తారక్. ఈ నేపథ్యంలో ఓ సందేశాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

"ప్రతి ఏటా నా పుట్టినరోజున మీరు చూపించే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తా. ఈ ఏడాది మాత్రం మీరు ఇంటి పట్టునే ఉంటూ, అధికారుల సూచనలను పాటిస్తూ, భౌతిక దూరానికి కట్టుబడి ఉండాలని నా విన్నపం."

-జూనియర్ ఎన్టీఆర్, హీరో

ఈసారి తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని 'ఆర్​ఆర్ఆర్' నుంచి ఏదో సర్​ప్రైజ్ వస్తుందని అభిమానులంతా ఆశించారు. కానీ లాక్​డౌన్ వల్ల సాంకేతిక అవరోధాలు ఏర్పడ్డాయని.. అందుకే టీజర్ కానీ, ఫస్ట్​లుక్ కానీ విడుదల చేయట్లేదని చిత్రబృందం స్పష్టం చేసింది. దీనిపై తారక్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

"ఆర్​ఆర్ఆర్ నుంచి ఈ సందర్భంగా ఎటువంటి ఫస్ట్​లుక్ కానీ, టీజర్​ కానీ విడుదల కావడం లేదనే విషయం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని నేను అర్థం చేసుకోగలను. సర్​ప్రైజ్ మీ ఆనందం కోసం సిద్ధం చేయాలని చిత్రబృందం ఎంతగా కష్టపడింది అనేది నాకు తెలుసు. కానీ ఒక ప్రచార చిత్రం మీ ముందు ఉండాలి అంటే అన్ని సాంకేతిక విభాగాలు కలిసి శ్రమించాలి. అధికారిక ఆంక్షల వలన అది కుదరలేదు. రాజమౌళి గారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పక అలరిస్తుంది."

-జూనియర్ ఎన్టీఆర్, హీరో

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు సందడి చేయనున్నారు.

ఎన్టీఆర్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details