దర్శకుడు ఓం రౌత్-హీరో ప్రభాస్ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా 'ఆదిపురుష్'. అయితే ఈ చిత్రబృందం తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సినిమాలో కొత్త నటీనటుల కోసం తాము ఎటువంటి ప్రకటన ఇవ్వలేదని ఇందులో తెలిపింది.
"ఆదిపురుష్లో కొత్తవారిని తీసుకోనున్నట్లు వదంతులు వస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. మేము అధికారికంగా ప్రకటించే వరకు అలాంటి వాటిని దయచేసి నమొద్దు. త్వరలోనే మా సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ను ప్రకటిస్తాం. అప్పటివరకు జాగ్రత్తగా ఆరోగ్యంగా, సామాజిక దూరం పాటిస్తూ ఉండండి. అలానే నకిలీ వార్తలను పట్టించుకోవద్దు."