కోలీవుడ్ హీరో కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రం 'దొంగ'. శుక్రవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం... తాజాగా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఇందులోని ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కార్తీ అక్కగా జ్యోతిక నటించడం విశేషం.
'అతని పేరు ఏమని చెప్పాడు.. విక్కీ, గురు, అర్జున్.. ఒక్కో కేసుకు ఒక్కో పేరు', 'ప్రేమ అన్నింటిని మార్చేస్తుంది సర్వా.. నిన్ను మార్చింది, నన్ను మార్చింది' లాంటి డైలాగ్‌లు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.