'వైదిస్ కొలవెరీ దీ' అంటూ దేశాన్ని ఊపేసిన ధనుష్.. తమిళంలో ఎన్నో హిట్లు అందుకున్నాడు. బాలీవుడ్‌లోనూ రాంఝానా సినిమాతో అదరగొట్టాడు. హాలీవుడ్‌లోనూ తన మార్క్‌ను చూపించేందుకు సిద్ధమయ్యాడు. అతడు హీరోగా నటించిన 'ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్' జూన్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హాలీవుడ్ సినిమా చిత్రీకరణలో తన అనుభవాలను, అభిప్రాయాలను ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ధనుష్.
ద ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్ సినిమాలోని తన పాత్రకు 100శాతం న్యాయం చేశానని ధనుష్ చెప్పాడు. ఏ భాషలో నటించామని కాదని, పాత్రకు ఎంత న్యాయం చేశామన్నదే ముఖ్యమని అన్నాడు.
"తమిళం, హిందీ, ఇంగ్లిషు... ఏ భాషలో నటించినా అన్నీ నాకు ఒకటే. నా పని నేను చేస్తా. నేను అన్నీ ఒకటేనని భావిస్తా. పాత్రకు న్యాయం చేయడమే నాకు ముఖ్యం. నేను ఆ పని చేశానని అనుకుంటున్నా."
- ధనుష్, హీరో
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నటులు, సాంకేతిక నిపుణులతో పని చేయడం వల్ల చాలా విషయాలు, అంశాలు నేర్చుకునే అవకాశం కలిగిందని చెప్పాడు ధనుష్.