భూమి పెడ్నేకర్, కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారె'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. సమాజంలో నెలకొన్న నిబంధనలను వ్యతిరేకిస్తూ.. ఆ సంకెళ్లను తెంచుకోవాలని చూసే ఇద్దరు అక్కా చెల్లెల్ల కథతో రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో కొంకణ.. డాలీ పాత్రలో కనిపించగా, భూమి.. కాజల్(కిట్టి) పాత్రలో అలరించింది.
ట్రైలర్: సామాజిక సంకెళ్లను తెంచుకోవాలని! - కొంకన సేన్ శర్మ
బాలీవుడ్ చిత్రం 'డాలీ కిట్టీ ఔర్ వో చమక్తే సితారె' ట్రైలర్ విడుదలైంది. భూమి పెడ్నేకర్, కొంకణా సేన్ శర్మ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
డాలీ తనకు ఇష్టంలేని వివాహం వలలో చిక్కుకుని.. ఆ తర్వాత ఓ సేల్స్ మాన్‌తో కలిసి ఆమె జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కిట్టి.. నగర జీవితం గురించి కలలు కంటూ.. ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్లు ట్రైలర్లో చూపించారు.
బాలాజీ టెలీ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అలంక్రిత శ్రీవాత్సవ దర్శకత్వం వహించారు. కుబ్రా సైట్, కరణ్ కుంద్రా, అమోల్ పరాషర్, విక్రాంత్ మాసేలు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబరు 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందీ చిత్రం.