తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డాలీ, కిట్టీగా అలరిస్తోన్న భూమి, కొంకణా సేన్ - Bhumi pednekar news

బాలీవుడ్ నటీమణులు కొంకణా సేన్ శర్మ, భూమి పెడ్నేకర్ కలిసి నటించిన చిత్రం ‘డాలీ కిట్టి ఔర్‌ వొ చమక్తే సితారే'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్​లో నెట్​ఫ్లిక్స్ ద్వారా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చిత్రబృందం.

డాలీ,కిట్టీగా అలరిస్తోన్న భూమి, కొంకణ
డాలీ,కిట్టీగా అలరిస్తోన్న భూమి, కొంకణ

By

Published : Aug 29, 2020, 9:18 AM IST

బాలీవుడ్‌ నటీమణులు కొంకణా సేన్‌ శర్మ, భూమి పెడ్నేకర్‌ కలిసి నటించిన చిత్రం 'డాలీ కిట్టి ఔర్‌ వొ చమక్తే సితారే'. అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదల చేయనున్నారు. ఈ సినిమా గతేడాది అక్టోబర్‌ 4, 2019లో బుస్సాన్‌ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ వేదికగా ప్రదర్శితమైంది.

ఈ చిత్రంలో కొంకణా సేన్‌ శర్మ, భూమి పెడ్నేకర్‌లు కజిన్స్​గా నటించారు. డాలీ (కొంకణా సేన్‌) మధ్య తరగతి ఇల్లాలు భర్త , ఓ కుమారుడితో కలిసి దిల్లీలోని శివారు ప్రాంతంలో నివసిస్తుంటుంది. ఈ కుటుంబం ఒక విలాసవంతమైన అపార్ట్ మెంట్‌లో ఉండాలని యోచిస్తుంటుంది.

ఇక ఊరిలో పుట్టి పెరిగిన కాజల్‌ (భూమి పెడ్నేకర్) నగరానికి చేరకుంటుంది. ఈమెకు సరైన చదువులేకపోవడం వల్ల పట్టణంలో పనిదొరకడం చాలా కష్టంగా మారుతుంది. అందుకని ఓ డేటింగ్‌ యాప్‌లో కిట్టి అనే పేరుతో సైబర్‌ ప్రేమికురాలిగా పనిచేస్తుంది. అందులో భాగంగా ఓ వ్యక్తిని కలుస్తుంది. ఆ తరువాత వీరిద్దరి జీవితాల్లో ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఇంకా చిత్రంలో విక్రాంత్ మాసే, ముష్తాక్ ఖాన్ అమోల్ పరాషర్, కుబ్రా సైట్, కరణ్ కుంద్రా తదితరులు నటించారు.

ABOUT THE AUTHOR

...view details