ఐఫా అవార్డుల ప్రదానోత్సవం.. ముంబయిలో బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ తారలు, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సల్మాన్ ఖాన్‌ను ఓ వీధి కుక్క వెంబడించింది. గ్రీన్కార్పెట్పై అతడి వెనకే నడిచింది. ప్రస్తుతం ఈ వీడియో విశేషంగా అలరిస్తోంది.
నేవీ బ్లూ సూట్‌తో రిచ్ లుక్‌లో దర్శనమిచ్చిన బాలీవుడ్ కండల వీరుడు.. ఈ వేడుకలో ప్రధానాకర్షణగా నిలిచాడు. సల్మాన్‌ను వెంబడిస్తూ గ్రీన్కార్పెట్పై సందడి చేసిన కుక్కను చూసి అక్కడ నవ్వులు పూశాయి.