కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో ఏదో ఒక హీరో హీరోయిన్‌పై ప్రేమ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుశాంత్ రాజ్‌పుత్ - రియా చక్రవర్తిల మధ్య ఏదో నడుస్తుందని హిందీ చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి. సుశాంత్ మొదటగా అంకితా లోఖండేతో ప్రేమ వ్యవహారం నడిపాడు. వీరిద్దరూ చాలాకాలం సన్నిహితంగా కలిసి ఉన్నారు. ఆ బంధం కాస్త దూరమయ్యాక ఇప్పుడు నటి రియా చక్రవర్తితో చాలా దగ్గరగా ఉంటున్నాడని వార్తలు వస్తున్నాయి.
అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి షికార్లు చేస్తున్న కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే తన హితురాలిని కథానాయికగా తీసుకోమని సుశాంత్ తనకు తెలిసిన నిర్మాతలకు చెబుతున్నాడట. మొత్తానికి ప్రియురాలి కోసం సుశాంత్ పడరాని పాట్లు పడుతున్నాడని చెప్పుకుంటున్నారు.