తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్​ శవపరీక్ష చేసిన వైద్యులకు బెదిరింపులు! - సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ పోస్టుమార్టమ్​ రిపోర్ట్స్​

సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ శవపరీక్ష నివేదిక ఇచ్చిన వైద్యులు ప్రస్తుతం బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. పోస్ట్​మార్టమ్​ రిపోర్ట్​ స్క్రీన్​షాట్లు బయటకు రావడం వల్లే వారికి అసభ్యకరమైన ఫోన్​కాల్స్​, సందేశాలు వస్తున్నాయని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా హీరో మృతి వెనకున్న నిజం బయటపడకుండా వైద్యులు లంచం తీసుకున్నారని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Doctors who conducted Sushant Singh Rajput's autopsy get threats, abuse
సుశాంత్​ శవపరీక్ష చేసిన వైద్యులకు బెదిరింపు కాల్స్​!

By

Published : Aug 20, 2020, 11:13 AM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ శవపరీక్ష నివేదిక ఇచ్చిన వైద్యులు ప్రస్తుతం బెదిరింపులు, ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆ నివేదికకు సంబంధించిన స్క్రీన్​ షాట్లు సోషల్​మీడియాలో వైరల్​ అవ్వడమే అందుకు కారణం. అందులో కూపర్​ ఆస్పత్రికి చెందిన ఐదుగురు వైద్యుల పేర్లు, చరవాణి నంబర్లు ఉన్నాయి. సుశాంత్​ మృతి వెనుక కుట్ర జరుగుతుందన్న ప్రచారం వల్ల ఇందులో వైద్యుల పాత్ర ఉందేమోనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొన్ని రోజులుగా ఆ ఐదుగురు వైద్యులకు అసభ్యకరమైన పదజాలంతో ఫోన్​కాల్స్, సందేశాలు వస్తున్నాయని మహారాష్ట్ర మెడికో లీగల్​ అసోసియేషన్​ అధ్యక్షుడు డాక్టర్​ శైలేష్​​ మోహితే వెల్లడించారు. అయితే సుశాంత్​ మృతికి సంబంధించిన నిజం తెలియకుండా ఉండేందుకు వైద్యులు లంచం తీసుకున్నారని కొంతమంది ఆరోపించారని కొన్ని వార్తా సంస్థలు నివేదించాయి.

"పోస్ట్​ మార్టమ్​ నివేదికపై సంతకం చేసిన ఐదుగురు వైద్యులు వేధింపులకు గురవుతున్నారని కూపర్​ ఆస్పత్రి డీన్ డాక్టర్​ పినాకిన్ గుజ్జర్​ నాకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రికి చెందిన ల్యాండ్​లైన్​ నంబర్లకూ ఇలాంటి కాల్స్ వస్తున్నాయని తెలిసింది. అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది వైద్యుల వ్యక్తిగత వివరాలతో సోషల్​మీడియాలో స్క్రీన్​షాట్లను పంచుకున్నారు. వైద్యుల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఇటువంటి వేధింపులకు పాల్పడటం దురదృష్టకరం."

- డాక్టర్​ శైలేష్​ మోహితే, మహారాష్ట్ర మెడికో లీగల్​ అధ్యక్షుడు

సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం(ఆగస్టు 19) కీలక తీర్పునిచ్చింది. ఇప్పటివరకు సేకరించిన అన్ని ఆధారాలను సీబీఐకి అందజేయాలని మహారాష్ట్ర పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అవసరమనుకుంటే కొత్తగా కేసు నమోదు చేసేందుకు సీబీఐకి అవకాశం కల్పించింది సుప్రీంకోర్టు. మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి సహకరించాలని ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు కోరే అర్హత బిహార్ ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం సమర్థించింది.

ABOUT THE AUTHOR

...view details