'కంచె' సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్. ఆపై 'ఓం నమో వెంకటేశాయ', 'గుంటూరోడు', 'నక్షత్రం', 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలతో అలరించారు. 2018 తర్వాత ఆమె కొత్త చిత్రానికి సంతకం చేయలేదు. కాగా ఆదివారం ఆమె ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ .. "మీరు వరుసగా చిత్రాల్లో ఎందుకు నటించడం లేదు?, ఎందుకు విరామం తీసుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాం" అని అన్నాడు. దీనికి ప్రగ్యా స్పందిస్తూ.. "ధన్యవాదాలు. సరైన స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నా" అని సమాధానం ఇచ్చారు. ఇలా నెటిజన్లకు, ఆమెకు మధ్య జరిగిన సంభాషన ఓసారి చూద్దాం..
నాగార్జునతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
ప్రగ్యా:అద్భుతం.. ఆయన ఓ గొప్ప నటుడే కాదు వ్యక్తి కూడా.
మీ ముఖంపై చిరునవ్వు తెప్పించే విషయం?
ప్రగ్యా: రుచికరమైన ఆహారం
లాక్‌డౌన్‌లో మీరు చేసిన ది బెస్ట్ పని ఏంటి?
ప్రగ్యా:వంట నేర్చుకోవడం.
మీ క్వారంటైన్‌లో ఏం నేర్చుకున్నారు?
ప్రగ్యా:బనానా చాక్లెట్ కేక్
ప్రస్తుతం మీ జీవనశైలి ఎలా ఉంది?
ప్రగ్యా: వర్కౌట్.. వంట చేయడం.. ఇల్లు శుభ్రం చేసుకోవడం.. కొత్త విషయాలు తెలుసుకోవడం.
'అల వైకుంఠపురములో..' సినిమా చూశారా?
ప్రగ్యా: చూశా. నాకు నచ్చింది. అల్లు అర్జున్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు.
ఇప్పుడు ఏ వెబ్‌సిరీస్ చూస్తున్నారు?
ప్రగ్యా:ది లాస్ట్ కింగ్‌డమ్
టాలీవుడ్ గురించి ఒక్క మాట?
ప్రగ్యా:నా ఇల్లు.
టీ లేదా కాఫీ?రెండింటిలో ఏది ఇష్టం!
ప్రగ్యా: టీ.