తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'హే రామ్'​ కోసం​ ఒక్క రూపాయి తీసుకోని షారుక్ - హే రామ్​ సినిమా అప్​డేట్స్​

'హే రామ్'​ సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 18) రెండు దశాబ్దాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న కమల్.. ట్విట్టర్​ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

Do-you-know-what-Shah-Rukh-Khan-salary-for-Hey-Ram
'హే రామ్'​ చిత్రానికి షారూక్​ ఒక్క రూపాయి తీసుకోలేదట..!

By

Published : Feb 18, 2020, 8:01 PM IST

Updated : Mar 1, 2020, 6:36 PM IST

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన పీరియడికల్ డ్రామా 'హే రామ్‌'. బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్‌, రాణి ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో వివాదాల మధ్య 2000 ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన కమల్... అప్పటి సంగతుల్ని పంచుకున్నాడు.

హే రామ్​ సినిమాలో కమల్​హాసన్​

"హేరామ్‌' సినిమాకు 20 ఏళ్లు. ఆ సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం సంతోషంగా అనిపించింది. విచారం ఏంటంటే, బెదిరింపులు, హెచ్చరికలు వచ్చినా, నిజాన్ని నిర్భయంగా చెప్పిందీ చిత్రం. ఈ సవాళ్లన్నీ అధిగమించి దేశ సామరస్యాన్ని పరిరక్షించే లక్ష్యంలో విజయం సాధించాం"

- కమల్​హాసన్​, కథానాయకుడు

ఈ సినిమాలో షారుక్ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. రామ్‌ (కమల్‌ హాసన్‌) స్నేహితుడు అంజాద్‌ అలీఖాన్‌ పాత్రను పోషించాడు. ఇందులో షారుక్ చేసిన పాత్ర కోసం ఒక్క పైసా రెమ్యూనరేషన్​ తీసుకోలేదు. ఈ విషయాన్ని కమల్‌హాసన్‌ స్వయంగా చెప్పాడు.

"ఈ విషయాన్ని ఎవరూ నమ్మరు. ఇలాంటి కథను, చిత్రాన్ని భవిష్యత్‌లో మళ్లీ చేసే అవకాశం రాదని వారు భావించారు. కొందరు మాత్రం 'షారుక్ బిజినెస్‌మెన్‌, కమర్షియల్‌ మైండ్‌' అని చెప్పారు. కానీ, 'హే రామ్‌' బడ్జెట్‌ ఏంటో షారుక్​కు తెలుసు. తాను కేవలం సినిమాలో భాగస్వామి మాత్రమే అవ్వాలనుకున్నాడు. లేదంటే కమల్‌తో కలిసి చిన్న సన్నివేశంలో కనిపిస్తే చాలని అనుకున్నాడు. అనుకున్న బడ్జెట్‌ దాటిపోయినా అతడు రూపాయి కూడా అడగలేదు. కేవలం నా చేతి గడియారం మాత్రం ఇచ్చాను" అని చెప్పాడు కమల్​హాసన్​.

హే రామ్​ చిత్రానికి సంబంధించిన ట్వీట్ చేసిన కమల్​హాసన్​​

మూడు జాతీయ అవార్డులు

2000 విడుదలైన 'హే రామ్‌'.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మూడు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ సహాయ నటుడిగా అతుల్‌ కుల్‌కర్ణి, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సారిక, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్‌ విభాగంలో మంత్రకు అవార్డులు వచ్చాయి. ఈ చిత్రంలో మహత్మాగాంధీగా నషీరుద్దీన్‌ షా నటించాడు. కమల్‌ హాసన్‌ ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులను అలరించాడు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించిన సినిమాకు ఇళయరాజా సంగీతం హైలట్‌ అని చెప్పొచ్చు.

ఇదీ చూడండి.. ఆ ముగ్గురితో విహారయాత్రకు వెళ్తా: మహేశ్

Last Updated : Mar 1, 2020, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details