తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాజ్​కుమార్​ హిరాణీకి ఆ పేరు అలా వచ్చింది! - రాజ్​కుమార్​ హిరానీకి ఆ పేరు ఎలా వచ్చింది

విభిన్న చిత్రాల దర్శకుడు రాజ్​కుమార్ హిరాణీకి ఆ పేరు ఎలా వచ్చింది. ఆయన తండ్రి ఆ పేరు పెట్టడానికి పెద్ద చరిత్రే ఉంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

Do you know how director Rajkumar Hirani got that name?
రాజ్​కుమార్​ హిరాణీకి ఆ పేరు ఎలా వచ్చిందంటే!

By

Published : Nov 30, 2020, 4:34 PM IST

కన్న బిడ్డలపై ప్రేమతో వారి పేర్లను ఇంటికో, సొంత వ్యాపార దుకాణానికో పెట్టి మురిసిపోయే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ విషయంలో మాత్రం అది రివర్స్‌లో జరిగింది. ఆయన తండ్రి సురేశ్​ హిరాణీ ఓ టైపింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నడిపేవారు. దాని పేరు రాజ్‌కుమార్‌ ఇన్‌స్టిట్యూట్‌. తన కొడుకు పేరుమీద అలా పెట్టారేమో అనుకుంటే పొరబడినట్లే! అప్పటికి ఇంకా ఆయనకు పెళ్లే కాలేదు.

అయితే ఆ ఇన్‌స్టిట్యూట్​కు తక్కువ కాలంలోనే మంచి పేరొచ్చింది. దాని​ వల్ల సురేశ్​ హిరాణీ ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకుని ఓ బిడ్డకు తండ్రయ్యారు. తనకు బాగా కలిసొచ్చిన రాజ్‌కుమార్‌ పేరును సెంటిమెంట్‌గా భావించి, తన బిడ్డకూ అదే పేరు పెట్టారు. ఆ సెంటిమెంట్‌ ప్రభావమో ఏమో కానీ రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.

కొసమెరుపేంటంటే తండ్రి నడిపిన టైపింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు గుర్తుగా ఇప్పటికీ ఓ పాత టైపింగ్‌ మెషీన్‌ను తన ఆఫీసులో భద్రంగా దాచుకున్నారు దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ.

ABOUT THE AUTHOR

...view details