తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోనమ్​ కపూర్​ కరోనాతో బాధపడుతోందా? - covid-19 news

బాలీవుడ్​ నటి సోనమ్​ కపూర్​ ఆరోగ్యంపై.. నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలె లండన్​ వెళ్లొచ్చిన ఆమె ఓ వీడియో పోస్టు​ చేయగా.. అది కాస్తా చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న ప్రశ్నలపై తాజాగా క్లారిటీ ఇచ్చిందీ అందాల భామ.

Do not travel by train and be in self-quarantine: Actress Sonam kapoor
సోనమ్​ కపూర్​ కరోనాతో బాధపడుతోందా?

By

Published : Mar 24, 2020, 11:54 AM IST

Updated : Mar 24, 2020, 12:38 PM IST

బాలీవుడ్​ నటి సోనమ్​ కపూర్​కు కరోనా వచ్చిందా? అని నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఇందుకు ఆమె ట్వీట్​ చేసిన ఓ వీడియో కారణంగా తెలుస్తోంది. ఇటీవలె లండన్​ నుంచి వచ్చిందీ స్టార్​ హీరోయిన్​. ఆ తర్వాత ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంది. అయితే పోస్టు చేసిన వీడియోలో సోనమ్​ కపూర్​ను చూసిన అభిమానులు.. పేషంట్​లా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే తాజాగా దానిపై క్లారిటీ ఇచ్చిందీ అందాల భామ.

తన ఫోన్​ కెమెరాలో 'వివిధ్​' ఫిల్టర్​ ఆన్​ అయ్యి ఉంటుందని ఓ నెటిజన్​ చెప్పగా.. దానికి 'అవును' అని సమాధానమిచ్చింది సోనమ్​.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది బాలీవుడ్​ హీరోయిన్​ సోనమ్​ కపూర్​. ఈ సమయంలో ప్రయాణాలు చేయొద్దని.. పౌరులంతా స్వీయనిర్బంధం పాటించాలని కోరింది.

ప్రస్తుతం కేంద్రం సహా ఆయా రాష్ట్రాలు లాక్​డౌన్​ను విధించడం వల్ల.. దేశవ్యాప్తంగా ప్రజారవాణా స్తంభించిపోయింది. మార్చి 31 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.

" రైల్వేస్టేషన్​లలో రద్దీ కారణంగా వైరస్​ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప రైల్వే స్టేషన్లను సందర్శించ వద్దు. మీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి".

-- సోనమ్​ కపూర్​, కథానాయిక

సోనమ్​ కపూర్​

భారత్​లో కరోనా ​ కేసులు 500లకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 492 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి.. మలయాళ రీమేక్​లో నందమూరి బాలకృష్ణ!

Last Updated : Mar 24, 2020, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details