బాలీవుడ్ ప్రముఖ హీరో జాన్ అబ్రహం సరసన నటించేందుకు సిద్ధమవుతోంది నటి దివ్య ఖోస్లా. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న 'సత్యమేవ జయతే 2'లో సందడి చేయనుందీ భామ. ఇటీవలే గణపతి ఉత్సవాల్లో భాగంగా ముంబయిలోని వినాయకుడి ఆలయాన్ని సందర్శించిన వీరిద్దరూ.. సినిమాలో నటించే విషయంపై స్పష్టతనిచ్చారు.
జాన్ సరసన హీరోయిన్గా దివ్య ఖోస్లా రీఎంట్రీ - సత్యమేవ జయతే2
బాలీవుడ్ దర్శకురాలు, నటి దివ్య ఖోస్లా.. హీరో జాన్ అబ్రహం పక్కన త్వరలో కనిపించనుంది. పెళ్లి తర్వాత చాలా ఏళ్లు విరామం తీసుకున్న ఈ భామ... ఇప్పుడు 'సత్యమేవ జయతే 2'లో అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా కథానాయకుడు జాన్ వెల్లడించాడు.
జాన్ సరసన హీరోయిన్గా దివ్య ఖోస్లా రీఎంట్రీ
టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ను2005లో వివాహమాడిన దివ్య ఖోస్లా... 2014లో 'యారియాన్'తో దర్శకురాలిగా మారింది. అనంతరం 'సనమ్రే' చిత్రాన్ని తెరకెక్కించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాతో హీరోయిన్గా పునరాగమనం చేస్తోంది. 'సత్యమేవ జయతే' తొలి భాగం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులోని 'దిల్బర్ దిల్బర్' పాట ప్రేక్షకుల మన్ననలు పొందింది.
ఇవీ చూడండి...
Last Updated : Sep 30, 2019, 8:40 AM IST