తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బొబ్బిలి రాజా'తో దివ్య భారతి ఎంట్రీ అలా!

'బలపం పట్టి భామ బళ్లో అ..ఆ..ఇ..ఈ నేర్చుకుంటా' అని వెంకటేశ్ పాడుతుంటే ఆ భామ బడికి రోజూ వెళ్లాలనిపిస్తుంది ఎవరికైనా! 'కన్యా కుమారీ కనపడదా దారీ' అన్నాడు దివ్య భారతిని చూసి ఓ సినీకవి. ఆ సంగతేమో గానీ ఆమెను చూసేవాళ్లకు మాత్రం ఇంకేం కనపడదు. ఇంతకీ దివ్య భారతి తెలుగు తెరకు ఎలా పరిచయమైందంటే?

divya bharati first chance in telugu film industry
ఈ అందం.. బొబ్బిలి రాజాతో అలా పరిచయమైంది!

By

Published : Dec 27, 2020, 8:52 AM IST

బొబ్బిలి రాజా.. విక్టరీ వెంకటేశ్​కు కెరీర్​లో గుర్తుండిపోయే విజయాన్ని అందించిన సినిమా. తెలుగు పరిశ్రమకు ఓ మరపురాని బాపుబొమ్మను పరిచయం చేసింది. ఆమెనే దివ్య భారతి. అయితే ఈ చిత్రంలో అనుకోకుండా ఆమెకు అవకాశం దక్కింది. అది ఎలా అంటే?

'బొబ్బిలి రాజా'లో దివ్యభారతి

తెరపై వాలిన తార..

'బొబ్బిలి రాజా'తో దివ్య భారతి పరిచయమైందంటే అందుకు కారణం ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. అందం, పొగరు కలగలపిన సినిమాలోని పాత్రకు నటి రాధను తొలుత తీసుకుందామని అనుకున్నారు నిర్మాత రామానాయుడు. ఆ తరహా పాత్రలు రాధ అప్పటికే చాలా చేయడం వల్ల కొత్త హీరోయిన్​ అయితే బాగుంటుందని పరుచూరి భావించారట.

దివ్యభారతి

దాంతో రామానాయుడు తన వద్ద ఉన్న కొందరి ఫోటోలను ఇచ్చి గోపాలకృష్ణనే ఎంపిక చేయమన్నారు. దివ్యభారతిని చూసిన ఆయన.. ఓ అమ్మాయి ఫొటోను చూపించి, ఆమె అయితే పాత్రకు సరిగ్గా సరిపోతుందని అన్నారట. అలా టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది దివ్య భారతి.

ఇదీ చూడండి:టుడే సోషల్ వాచ్: స్టైలిష్ లుక్స్​తో అదరగొట్టిన తారలు

ABOUT THE AUTHOR

...view details