సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) ఏర్పాటైంది. దీని ద్వారా ఆదివారం నుంచి కార్మికులకు కావల్సిన నిత్యావసర సరుకులతోపాటు వెయ్యి రూపాయల విలువైన మందులను ఇంటివద్దకే పంపిణీ చేయనున్నట్లు ఆ కమిటీ సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్లు తెలిపారు.
సీసీసీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీకి సిద్ధం! - కరోనా క్రైసిస్ ఛారిటీ న్యూస్
కరోనా కారణంగా సినీపరిశ్రమలో కార్మికులకు పనిలేకుండా పోయింది. దీంతో వారు ఆర్థికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరిని ఆదుకోవటానికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) ఏర్పాటైంది. ఆదివారం నుంచి అవసరమైన వారికి కావాల్సిన సరుకులను పంపిణీ చేయనున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు.
సీసీసీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీకి సిద్ధం!
ఈ సహాయనిధికి నటీనటులు, దర్శక నిర్మాతల నుంచి ఇప్పటి వరకు 7 కోట్లకుపైగా విరాళాలు సమకూరాయి. 24 విభాగాల్లోని నిరుపేద కార్మికులతో జాబితాను కమిటీ సిద్ధం చేసింది. ఈ నిధులతో వారికి కావాల్సిన సామగ్రిని ఏర్పాటు చేసి.. అత్యవసరంగా ఉన్న వారి పేర్లను కమిటీలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కరోనా సంక్షోభంలోనే కాకుండా ఛారిటీ నిరంతరం పనిచేసేలా చిరంజీవి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.
ఇదీ చూడండి..'ఐసోలేషన్షిప్'లో నటి ఊర్వశి అందాలు