ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ తెరకెక్కించిన చిత్రం 'ములన్'. 1998లో యానిమేటెడ్ రూపంలో విడుదలైన 'ములన్' సినిమాకు ఇది సీక్వెల్. చారిత్రక యుద్ధ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి నిక్కీ కారో దర్శకత్వం వహించారు. ఇందులో హాలీవుడ్ నటి లియు-హువా టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. సెప్టెంబరు 4న డిస్నీ ప్లస్‌లో విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
అమెరికాలో కాకుండా మరే దేశంలోనైనా 'ములన్' చిత్రాన్ని చూడాలంటే దాదాపుగా రూ. 2,300లను వెచ్చించాల్సి ఉంటుందట. కేవలం ఈ సినిమా కోసమే డిస్నీ తీసుకొస్తున్న కొత్త పద్ధతి ఇది. అయితే ఈ పద్ధతిని భవిష్యత్‌లో ఆచరించమని నిర్మాణ సంస్థ చెబుతోంది.