తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​లో దిశా పటానీ.. 'క్రేజీ అంకుల్స్​' రిలీజ్​కు రెడీ​ - క్రేజీ అంకుల్స్​

కరోనా కారణంగా ఆగిపోయిన 'ఏక్​ విలన్​ రిటర్న్స్​' షూటింగ్​ తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్​లో క్రేజీ హీరోయిన్​ దిశా పటానీ కూడా పాల్గొంది. అలాగే, టాలీవుడ్​ చిత్రం 'క్రేజీ అంకుల్స్​' విడుదలకు సిద్ధమైంది.

Disha Patani to start shooting for the second schedule of 'Ek Villain Returns'
షూటింగ్​లో దిశపటానీ.. 'క్రేజీ అంకుల్స్​' రిలీజ్​

By

Published : Aug 13, 2021, 7:04 AM IST

బాలీవుడ్​ క్రేజీ కథానాయిక దిశా పటానీ 'ఏక్​ విలన్​ రిటర్న్స్​' సెట్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. హిట్​ చిత్రం 'ఏక్​ విలన్​'కు సీక్వెల్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మోహిత్​ సూరి. దిశతో పాటు జాన్​ అబ్రహం, అర్జున్​ కపూర్​, తారా సుతారియా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షెడ్యూల్​ మొదలైంది. దిశ చిత్రీకరణలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 'మలంగ్​' చిత్రం తర్వాత మోహిత్​ సూరి దర్శకత్వంలో దిశ నటిస్తున్న చిత్రమిది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

'క్రేజీ అంకుల్స్​' వచ్చేస్తున్నారు!

'క్రేజీ అంకుల్స్​' రిలీజ్​ పోస్టర్​

శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'క్రేజీ అంకుల్స్‌'. ఇ.సత్తిబాబు దర్శకుడు. శ్రీవాస్‌ 2 క్రియేషన్స్‌ సారథ్యంలో గుడ్‌ ఫ్రెండ్స్‌, బొడ్డు అశోక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈనెల 19న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. "ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. కుటుంబంతో కలిసి హాయిగా చూడగలిగేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు మంచి ఆదరణ వచ్చింది. సినిమాను అంతే చక్కగా ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అని నిర్మాతల్లో ఒకరైన శ్రేయాస్‌ శ్రీనివాస్‌ అన్నారు. రఘు కుంచె ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

ఇదీ చూడండి..ఏముందిరా బాబు.. అస్సలు మైండ్​లో నుంచి పోవట్లేదు!

ABOUT THE AUTHOR

...view details