ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ తను చేసే సాహస దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో పెడతూ సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో వస్తోన్న 'రాధే' చిత్రంలో సల్మాన్‌ఖాన్ సరసన నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పాట చిత్రీకరణ కోసం డ్యాన్స్ సాధన చేస్తుండగా మోకాళ్లకి దెబ్బలు తగిలించుకుంది. అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఆయనతో సావాసం అంటే ఇలానే ఉంటది.. - radhe movie updates
సల్మాన్ ఖాన్, దిశా పటానీ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'రాధే'. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని పాట చిత్రీకరణలో గాయపడింది నటి దిశా. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
దిశా
ఆయనతో సావాసం అంటే ఇలానే ఉంటది..
"ప్రభుదేవా సినిమాలో పాటలంటే ఇలాగే ఉంటుంది"..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొంతమంది నెటిజన్లు మాత్రం కష్టానికి తగిలిన ఫలితం తరువాత వస్తుందులే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకుముందు సల్మాన్‌తో కలిసి 'భారత్' చిత్రంలో నటించింది దిశా. ఇప్పుడు మరోసారి భాయ్‌జాన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.
ఇవీ చూడండి.. గోవాకు వెళ్లిన 'రొమాంటిక్' బృందం