"ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రేక్షకులకు వినోదం అందించే అవకాశం లభించడం గర్వంగా ఉంద"ని అంటోంది బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ. సల్మాన్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన 'రాధే'లో ఆమె కథానాయికగా నటించింది. ఈనెల 13న ఈ చిత్రం థియేటర్లతో పాటు ఓటీటీ వేదికల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దిశా పటానీ మాట్లాడారు.
"ఈ మల్టీ ప్లాట్‌ఫామ్ విధానం అనేది ఈ క్లిష్ట పరిస్థితుల్లో మంచి నిర్ణయం. థియేటర్ యాజమాన్యాల కోరిక మేరకు సాధ్యమైనన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సల్మాన్. అదే సమయంలో థియేటర్లు తెరిచే పరిస్థితి లేని ప్రాంతాల వారు ఓటీటీల ద్వారా చూసే వీలు ఉంది. ఈ సినిమాలో సల్మాన్‌తో పనిచేయడం మంచి అనుభూతి. 'భారత్' చిత్రం తర్వాత సల్మాన్‌తో మళ్లీ పనిచేసే అవకాశం దక్కడం నా అదృష్టం."