తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆదిత్యను నేను చాలాసార్లు ఓడించాను' - దిశా పటానీ తాజా వార్తలు

హీరో ఆదిత్య కపూర్​తో తన స్నేహం గురించి, ఇద్దరి మనస్తత్వాల గురించి చెప్పుకొచ్చింది నటి దిశా పటానీ. బాస్కెట్​బాల్ ఆటలో తనను చాలాసార్లు ఓడించినట్లు తెలిపింది.

'ఆదిత్యను నేను చాలాసార్లు ఓడించాను'
ఆదిత్య రాయ్ కపూర్ దిశా పటానీ

By

Published : May 10, 2020, 5:36 AM IST

Updated : May 10, 2020, 9:04 AM IST

బాలీవుడ్‌లో గతేడాది వచ్చిన చిత్రం 'మలంగ్‌'. ఇందులో జంటగా నటించిన ఆదిత్య రాయ్ కపూర్, దిశాపటానీలు తమ కెమిస్ట్రీతో మెప్పించారు. ఇప్పుడు 'ఏక్‌ విలన్‌ 2'లో మళ్లీ జోడీగా నటిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిశా.. ఆదిత్యతో తనకు ఎలా పరిచయమైంది, తామిద్దరి మధ్య ఉన్న సారుప్యతలు ఏంటో చెప్పుకొచ్చింది.

"నేను 'మలంగ్‌'లో నటించడానికి ముందే ఆదిత్య తెలుసు. అదీ ఎలాగంటే.. ఇద్దరం ఒకే జిమ్‌కు వెళ్లేవాళ్లం. అక్కడే అతడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత మంచి స్నేహితులమయ్యాం. ఓ సారి ఇద్దరం కలిసి బాస్కెట్‌ బాల్ ఆడాం. అందులో అతడ్ని (ఆదిత్య) చాలాసార్లు ఓడించాను. కొన్నాళ్ల తర్వాత ఇద్దరం 'మలంగ్‌'లో కలిసి నటించాల్సి వచ్చినప్పుడు మా మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది" -దిశాపటానీ, హీరోయిన్

లాక్‌డౌన్‌ వేళ 'మలంగ్‌' సహనటులైన అనిల్‌ కపూర్, ఆదిత్య కపూర్, కునాల్‌ కేమ్‌తో దిశా వీడియో చాట్ చేసింది. ఇందులో ఆమె మాట్లాడుతూ "ఆదిత్య కపూర్‌-నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మేమిద్దరం సమాజానికి వ్యతిరేకులం. ఇద్దరం ఎవరితోనూ అంత తొందరగా కలిసిపోం. మేమిద్దరం అంతర్ముఖులం. అందుకే అంటారు కాబోలు! ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందని. అలా మా ఇద్దరి మనస్తత్వాలు ఒకేలా ఉంటాయని అనుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం దిశా, ఆదిత్య నటిస్తున్న 'ఏక్ విలన్2'.. ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మోహిత్‌ సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Last Updated : May 10, 2020, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details