దిశా పటానీ.. ప్రస్తుతం బాలీవుడ్లో తన అందం, నటనా నైపుణ్యంతో దూసుకెళ్తోంది. ఇటీవల 'మలంగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ భామ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితం అందుకుంది. ఈ కారణంగా నిర్మాతలు ఓ సక్సెస్ పార్టీని ఏర్పాటుచేశారు. దీనికి పలువురు సెలిబ్రిటీలు హాజరయ్యారు. చిత్రబృందంతో పాటు హీరోయిన్ దిశా కూడా వచ్చింది.
సక్సెస్ పార్టీలో మెరూన్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించింది దిశా. కొద్ది సమయంలోనే సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటో వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు విపరీతంగా స్పందించారు. అయితే ఓ స్టార్ హీరో సోదరి కొంచెం అడ్వాన్స్‌గా ఓ ప్రశ్న అడిగింది. ఆమెవరో కాదు టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్.