బాలీవుడ్ హాట్ భామ దిశా పటాని సినిమాల్లో నటించడమే కాదు.. పాత్రలో లీనమైపోవడానికి ఎంత కష్టాన్నైనా భరిస్తుంది. ప్రస్తుతం దిశా నటిస్తున్న చిత్రం 'మలంగ్'. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల కోసం తీవ్రంగా శ్రమించిందట. ఈ చిత్రంలో నీటిలో తీసిన ఓ ముద్దు సన్నివేశం కోసం కూడా ఎంతో కష్టపడిందట ఈ ముద్దుగుమ్మ.
సాధారణంగా ఎవరైనా నీటిలో ఊపిరి తీసుకోకుండా ఎంతసేపు ఉండగలగుతారు? మహా అయితే కొన్ని నిమిషాల పాటు. కానీ ముద్దు సీన్ టేక్ ఓకే అవడానికి ఆ ఒత్తిడిని భరించి చుంబన సన్నివేశం బాగా వచ్చేందుకు కృషి చేసిందట దిశా. ఎలాంటి పూర్వానుభవం లేకుండానే ఒక్క రోజులోనే బైక్ నడపడం నేర్చుకుందట. అందులోనూ ఎక్కువ బరువున్న బైక్పై గతుకులు పడ్డ రోడ్డు మీద ప్రత్యేక శ్రద్ధతో పట్టుబట్టి మరీ సాధించిందట.