తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప'లో ఐటమ్​సాంగ్.. నటి భారీ డిమాండ్! - దిశా పటానీ పుష్ప సినిమా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. వీరిద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రమిది. అయితే ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందని.. ఆ పాటలో చిందేసేందుకు దిశా పటానీని సంప్రదించగా భారీ మొత్తం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Disha patani Demands Huge Amount For Pushpa Item Song
పుష్పలో ఐటమ్​సాంగ్.. నటి భారీ డిమాండ్!

By

Published : Dec 31, 2020, 3:09 PM IST

Updated : Dec 31, 2020, 4:08 PM IST

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. 'ఆర్య', 'ఆర్య-2' తర్వాత సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడం వల్ల 'పుష్ప'పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం', 'ఆర్య-2'లో 'రింగ రింగా' ఐటెమ్‌ సాంగ్స్‌ ప్రేక్షకుల్ని ఎంతో అలరించాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప'లోనూ ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉండనుందంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.

కాగా, తాజా సమాచారం ప్రకారం.. ఐటెమ్‌ సాంగ్‌లా కాకుండా సినిమాకు తగ్గట్టు కొంచెం ఫోక్‌ బీట్‌తో స్పెషల్‌ సాంగ్‌ను ఈ సినిమా కోసం చిత్రీకరించనున్నారట. అయితే, ఈ పాట కోసం బాలీవుడ్‌ నటి దిశాపటానీని 'పుష్ప' టీమ్‌ సంప్రదించిందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పాట కోసం ఆమె రూ.1.5 కోట్లు డిమాండ్‌ చేశారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కాగా, కరోనా కారణంగా వాయిదా పడిన 'పుష్ప' షూట్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను అరకులో చిత్రీకరించనున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు.

Last Updated : Dec 31, 2020, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details