కరోనా కారణంగా చిత్రపరిశ్రమలో పలు షూటింగ్‌లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు.. వారికి నచ్చిన వ్యాపకాలతో సమయాన్ని గడుపుతున్నారు. ఇలాంటి ఖాళీ సమయంలో తన పెంపుడు జంతువులతో గడుపుతోంది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ(Disha Patani). ఆమె పెంచుతున్న పిల్లులు జాస్మిన్, కిటీలతో అడుకుంటుంది.
Disha Patani: అలా.. జాస్మిన్, కిటీలతో సరదాగా! - దిశా పటాని ఏక్ విలన్ రిటర్న్స్
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ(Disha Patani).. వారంతపు సమయాన్ని తన పెంపుడు జంతువులతో గడుపుతోంది. పెంపుడు పిల్లులు జాస్మిన్, కిటీలతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. వీటిపై పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Disha Patani channels her love for cats, shares adorable pictures
దిశా పటానీ.. సల్మాన్‌ఖాన్‌తో 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' చిత్రంలో నటించింది. రంజాన్ సందర్భంగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. ప్రస్తుతం దిశా పటానీ.. 'ఏక్ విలన్ రిటర్న్స్' చిత్రంలో నటిస్తుంది.
ఇదీ చూడండి:నా పేరు దిశా.. 'రాధే' సినిమాతో వచ్చేశా!