తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సల్మాన్ వల్ల నా కోరిక తీరింది: దిశా పటానీ - దిశా పటానీ రాధే సినిమా

కండల వీరుడు సల్మాన్ ఖాన్​​ పక్కన రెండో సారి నటించే అవకాశం దక్కించుకుంది బాలీవుడ్ నటి దిశా పటానీ. భాయ్ పక్కన నటించడం వల్ల తన కోరిక తీరిందని చెబుతోంది దిశా.

దిశా పటానీ

By

Published : Nov 2, 2019, 5:01 PM IST

Updated : Nov 2, 2019, 8:32 PM IST

వరుణ్​తేజ్​ సరసన 'లోఫర్'లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటి దిశా పటానీ. ఇటీవల 'భారత్'​ సినిమాలో ప్రత్యేకగీతం ద్వారా ప్రేక్షకులను మెప్పించింది. మరోసారి ఆ సినిమా హీరో సల్మాన్​ ​పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న 'రాధే'లో ఈ అమ్మడు ముఖ్యభూమిక పోషించనుంది. శుక్రవారమే చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కండల వీరుడి పక్కన అవకాశం రావడంపై మాట్లాడింది.

దిశా పటానీ

"సల్మాన్​ఖాన్​తో పరిచయమే నాకు పెద్ద వరం.ఇప్పటికే ఈ స్టార్​ హీరో​తో భారత్​లో పనిచేశా. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నా.కండల వీరుడి పక్కన ఒక్కసారి నటించే అవకాశం రావడమే అదృష్టం. అలాంటిది ఆయనతో రెండోసారి నటించాలని కోరుకున్నా. అది రాధే ద్వారా తీరబోతోంది. ఇప్పుడు మరింత ఆనందంగా ఉంది".

- దిశా పటానీ, బాలీవుడ్ నటి.

సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌ , సోహైల్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్, రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభుదేవా దర్శకత్వంలో రానున్న ‘రాధే’ లో... జాకీష్రాఫ్, రణదీప్‌ హుడాలు నటిస్తున్నారు. వచ్చే ఏడాది మే 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: కొత్తతరం సినిమాలకు 'ఖైదీ' నాంది: మహేశ్​

Last Updated : Nov 2, 2019, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details