తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మలంగ్' చిత్రంలో ముద్దు కోసం నీటి కష్టాలు

ఆదిత్యారాయ్ కపూర్, దిశాపటానీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'మలంగ్'. 'ఆషికి 2', 'ఏక్ విలన్' ఫేమ్ మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ముద్దు సన్నివేశం కోసం రెండు రోజులు తీసుకుందట చిత్రబృందం.

Disha Patani
మలంగ్

By

Published : Jan 4, 2020, 2:31 PM IST

'ఏక్‌ విలన్‌’', ‘'ఆషికీ 2'’, 'హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ దర్శకుడు మోహిత్‌ సూరి నుంచి వస్తోన్న మరో చిత్రం 'మలంగ్‌'. ఆదిత్యరాయ్‌ కపూర్, దిశాపటానీ జంటగా నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంలోని ఆదిత్యరాయ్‌ కపూర్, దిశాపటానీలకు సంబంధించిన లుక్‌లను విడుదల చేశారు. సిక్స్‌ ప్యాక్‌ దేహంతో ఉన్న ఆదిత్యరాయ్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. క్రైమ్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌ ప్రతినాయకుడిగా ఓ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నాడు. కునాల్‌ ఖీము మరో కీలక పాత్రధారి.

ఈ సినిమాలోని ఓ ముద్దు సన్నివేశం కోసం ఆదిత్యరాయ్, దిశాపటానీ రెండు రోజులు శిక్షణ తీసుకున్నారు. "ఈ సినిమాలో నీటి అడుగున ముద్దు సన్నివేశం ఉంది. దాని కోసం నాయకానాయికలు చాలా కష్టపడాల్సి వచ్చింది. నీటి అడుగున ముద్దు సన్నివేశం కోసం రెండు రోజులు సాధన చేశారు. ఒక్క క్షణం పాటు సాగే ముద్దు సన్నివేశాన్ని ఒక్క షాట్‌లో తీయడం సాధ్యం కాలేదు. ఎక్కువ టేకులు తీసుకున్నాం" అని చిత్రవర్గాలు చెప్పాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5591227_kis.jpg

ఇవీ చూడండి.. 'ఏ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చెప్పలేం'

ABOUT THE AUTHOR

...view details