"మనం బలంగా అనుకుంటే.. అది తప్పకుండా నెరవేరుతుంది. నేను సల్మాన్‌తో కలసి చేసిన 'రాధే' సినిమా థియేటర్లో చూసుకోవాలి అనుకున్నా. అది ఇప్పుడు జరుగుతోంది" అని హీరోయిన్ దిశాపటానీ చెబుతోంది. ఈ బాలీవుడ్ సుందరి నటించిన 'రాధే' మే 13న థియేటర్లలో పాటు ఓటీటీ వేదికలపైనా విడుదలవుతోంది. గతేడాదే రావాల్సిన ఈ చిత్రం.. లాక్‌డౌన్‌తో ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు అభిమానులను అలరించడానికి సిద్ధమైంది.
బలంగా అనుకున్నా.. ఇప్పుడది జరిగింది: దిశా పటానీ - రాధే ట్రైలర్ట
తాను బలంగా కోరుకున్న విషయం ఈ మధ్య కాలంలో ఒకటి జరిగిందని ముద్దుగుమ్మ దిశా పటానీ ఆనందం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏంటా విషయం? ఏమిటా సంగతి?
దిశా పటానీ
'సల్మాన్‌తో చిత్రీకరణ ఎంత జాలీగా సాగిందో.. అన్ని నేర్పింది నాకు. 'సీటీమార్' పాట చాలా ప్రత్యేకమైంది. దీనికోసం ఆసక్తిగా ఎదురు చేస్తున్నా" అని దిశా పటానీ చెప్పుకొచ్చింది. దేవీశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ గీతం.. ప్రేక్షకుల ముందుకు సోమవారం రానుంది.
ఇది చదవండి:మాల్దీవుల్లో దిశా పటానీ.. బికినీతో హల్చల్