ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్.. దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించింది. తెలంగాణ పోలీస్‌కు సెల్యూట్ చెబుతూ, అభినందనలు చెప్పింది.
ఎన్‌కౌంటర్‌తో 'దిశ'కు న్యాయం: సినీ, క్రీడాలోకం
16:00 December 06
12:17 December 06
ఛార్మి
ప్రతి రేపిస్టును ఎన్‌కౌంటర్ చేయాలి. మహిళలను తక్కువ చేసి చూసే వారు పోలీసులను చూసి భయపడాలి. ఇలాంటి ఘటనకు పాల్పడే వారికి ముందు పోలీసులు గుర్తు రావాలి. భయం కలగాలి. హ్యాట్సాఫ్ టూ పోలీసు డిపార్ట్మెంట్. ఈరోజు మనకు నిజమైన దీపావళి.
11:54 December 06
బాలకృష్ణ
మరోసారి ఇలాంటి ఘటనకు పాల్పడే వారికి ఇది సరైన గుణపాఠంగా నిలవాలి. ముందు ముందు ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలి. నిందితులకు విధించిన శిక్ష పట్ల తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు అభినందనలు
11:43 December 06
గుత్తా జ్వాల
ఈ ఘటన భవిష్యత్తు రేపిస్టులను ఆపుతుందా..? ముఖ్యమైన ప్రశ్నేంటంటే.. వారు ఎలాంటి స్థాయిలో ఉన్నా ప్రతి రేపిస్టుకి ఇలాంటి శిక్షే పడాలి.
11:37 December 06
మంచు మనోజ్
మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించే వారు ఇకపై జాగ్రత్తగా ఉండండి. తల్లులు, అక్క,చెల్లెల్లు జాగ్రత్త వహించండి. పోలీసులకు హ్యాట్సాఫ్
11:34 December 06
పూరి జగన్నాథ్
తెలంగాణ పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే నిజమైన హీరోలు .నేను ఎప్పుడూ ఒకటి నమ్ముతుంటా.. మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు . నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే
11:31 December 06
విష్ణు మంచు
శుభవార్తతో నిద్రలేచా. మనం ఎప్పుడైతే రక్షణ కరువైందని అనుకుంటామో అప్పుడు పోలీసులు వారి బాధ్యత నిర్వర్తిస్తారు. పోలీసులకు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు హ్యాట్సాఫ్.
11:28 December 06
సాయిధరమ్ తేజ్
సిస్టర్ నిన్ను కాపాడుకోలేకపోయాం. కానీ న్యాయం జరిగింది. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు
11:22 December 06
నిధి అగర్వాల్
సరైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ పోలీసులకు సెల్యూట్.
10:52 December 06
ఉత్తేజ్
ఇలాంటి ఘటనకు ఎన్‌కౌంటర్ సరైన శిక్షని అన్నాడు ఉత్తేజ్. అబ్బాయిలను పద్ధతిగా పెంచాలని కోరాడు. నిందితులకు సరైన శిక్ష వేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు
10:23 December 06
రాశీఖన్నా
హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్. న్యాయం జరిగిందని భావిస్తున్నా.
10:21 December 06
సైనా నెహ్వాల్
అద్భుతంగా పని చేశారు. పోలీసులకు సెల్యూట్
10:15 December 06
రకుల్ ప్రీత్ సింగ్
ఇలాంటి దారుణాలు చేసి ఎంత దూరం పరుగెత్తగలరు. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు.
10:12 December 06
నాగార్జున
ఉదయం లేస్తూనే ఈ వార్త విన్నా. న్యాయం జరిగింది
10:03 December 06
విశాల్
చివరికి న్యాయం జరిగింది. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు
09:57 December 06
నాని
ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడు అయ్యుండాలి
09:54 December 06
సమంత
తెలంగాణ పోలీసులకు సెల్యూట్. భయానికి సరైన సొల్యూషన్ దొరికింది. అప్పుడప్పుడు ఇదే పరిష్కారం
09:44 December 06
హరీశ్ శంకర్
మా సినిమా టిజర్లు, ట్రైలర్లు ట్రెండింగ్ కాదు. ఈ ఎన్ కౌంటర్ ట్రెండింగ్ అవ్వాలి. ఈ ఎన్ కౌంటర్ ను చాటింపు వేసి చెప్పాలి. తన ప్రొఫైల్ ఫొటో తీసి సజ్జనార్ ఫొటో పెట్టుకున్న హరీశ్ శంకర్
09:41 December 06
అల్లు అర్జున్
న్యాయం జరిగింది
09:39 December 06
నిఖిల్
నిందితులకి ఈ శిక్ష సరైనది. అమాయకురాలైన దిశను తిరిగి తీసుకురాలేం. కానీ మరోసారి ఇలాంటి దారుణానికి పాల్పడకుండా ఉండటానికి ఇలాంటి శిక్షలు కనువిప్పు కలిగిస్తాయి.
09:34 December 06
కల్యాణ్ రామ్
బాధితురాలి కుటుంబం బాధను ఏం చేసినా తీర్చలేం. కానీ ఈ ఎన్‌కౌంటర్ కాస్త ఉపశమనం కలిగించవచ్చు. న్యాయం జరిగింది. దిశ ఆత్మకు శాంతి చేకూరాలి.
09:21 December 06
దిశ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించిన నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధరించారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై సినీ హీరోలు స్పందించారు.
జూనియర్ ఎన్టీఆర్
దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ న్యాయం జరిగిందని అన్నాడు. బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు.