తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భారీ సెట్​లో మాస్ మహారాజా సినిమా చిత్రీకరణ - payal rajput

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం డిస్కో రాజా. హైదరాబాద్​లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పాయల్ రాజ్​పుత్​, నబా నటేష్ హీరోయిన్లు.

రవితేజ

By

Published : Jul 23, 2019, 7:01 AM IST

రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం డిస్కోరాజా. పాయల్ రాజ్​పుత్​, నబానటేష్ కథానాయికలు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రూ. కోటి 20 లక్షల ఖర్చుతో వేసిన భారీ సెట్​లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ నెల 26తో హైదరాబాద్​లో షెడ్యూల్​ పూర్తవుతుంది. రవితేజ, వెన్నెల కిషోర్​ తదితర నటీనటులతో ఈ షెడ్యూల్లో షూటింగ్ జరుగుతోంది. ఆగస్టు మొదటి వారం నుంచి దిల్లీలో తదుపరి షెడ్యూల్ చిత్రీకరించనున్నట్టు చిత్రబృందం తెలిపింది.

ఎస్​ఆర్​టి ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్​పై రామ్ తాళ్లూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విఐ ఆనందం దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి సంభాషణలు రాస్తున్నాడు.

ఇది చదవండి: రామానాయుడు స్టూడియోలో '22' షూటింగ్​ షురూ

ABOUT THE AUTHOR

...view details