ఇటీవలే గోవాలో కొత్త షెడ్యూల్‌ను షురూ చేసింది డిస్కోరాజా చిత్రబృందం. అక్కడ కొన్ని కీలకమైన పోరాట ఘట్టాలతో పాటు నాయకానాయికలపై పాటలను చిత్రీకరించారు. తాజాగా గోవా షెడ్యూల్ పూర్తయినట్లు చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఓ బీచ్ ఒడ్డున 'డిస్కోరాజా' టైటిల్‌ను సైకత శిల్పంలా తీర్చిదిద్దినట్లు చూడొచ్చు.
సైకత శిల్పంగా మాస్ మహారాజ 'డిస్కోరాజా' - సైకత శిల్పంగా 'డిస్కోరాజా'
మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. ప్రస్తుతం గోవాలో షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని వినూత్నంగా తెలియజేసింది చిత్రబృందం.
సైకత శిల్పంగా 'డిస్కోరాజా'
ఈ చిత్రానికి వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పాయల్ రాజ్పుత్, నభా నటేశ్, తాన్యా హోప్లు కథానాయికలు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇదీ చూడండి: ప్రియుడితో కలిసి బోల్డ్ కథాంశంతో వస్తోంది
Last Updated : Sep 30, 2019, 5:23 PM IST