ఫస్ట్‌లుక్‌తోనే అందరిలోనూ ఆసక్తి పెంచిన చిత్రం 'డిస్కోరాజా'. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. సైఫై థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు. అభిమానులు అందరూ ట్రైలర్ వస్తుందేమో అని అనుకున్నారు. కానీ మేకింగ్ వీడియోతోనే సరిపెట్టింది చిత్రబృందం. విడుదలకు మరో రెండు రోజులే ఉన్నా.. ఇంకా ట్రైలర్ విడుదల చేయకపోవడమేంటని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదేమైనా కొత్త ప్రణాళికలో భాగమా అని ఆలోచిస్తున్నారు.
విడుదలకు సినిమా సిద్ధం.. అయినా రాని ట్రైలర్ - ravi teja-nabha natesh
మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న 'డిస్కోరాజా' సినిమా ట్రైలర్ ఇంకా రాకపోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
'డిస్కోరాజా' సినిమాలో రవితేజ
ఈ సినిమాలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లు. తమన్ సంగీమందించాడు. వి.ఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. రజనీ తాళ్లూరి నిర్మాత.
Last Updated : Feb 17, 2020, 8:11 PM IST