మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'డిస్కోరాజా'. తాజాగా సినిమాలోని పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'దిల్లీ వాలా' పేరుతో వచ్చిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. విడుదలైన 24 గంటల్లోనే 1మిలియన్ వీక్షణలకు చేరువైంది. హీరోని పరిచయం చేసే పాటగా అనిపిస్తోంది. ఇటవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.
'దిల్లీ వాలా'గా అలరిస్తున్న 'డిస్కో రాజా' - latest telugu cinema news
రవితేజ హీరోగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డిస్కో రాజా'. తాజాగా సినిమాలోని 'దిల్లీ వాలా' పాటను విడుదల చేసింది చిత్రబృందం.

'దిల్లీవాలా'గా అలరిస్తున్న 'డిస్కో రాజా'
ఇందులో నభా నటేశ్, పాయల్ రాజ్పుత్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వి.ఐ. ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం.
ఇవీ చూడండి.. పాటతో షూటింగ్ మొదలుపెట్టిన రజనీకాంత్