తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే 'డర్టీహరి' చిత్రం చేశా: ఎంఎస్ ‌రాజు - డర్టీహరి సినిమా నిర్మాత ఎంఎస్​ రాజు

'డర్టీహరి' సినిమా ఈ నెల 18న విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు దర్శకనిర్మాత ఎం.ఎస్​.రాజు. సినిమాలో బోల్డ్​ సన్నివేశాలున్నప్పటికీ .. అవి కథకు అనుగుణంగా తగిన మోతాదులోనే ఉన్నాయని చెప్పారు. కుటుంబ ప్రేక్షకులు చూడగలిగే చిత్రమని తెలిపారు. ఈ సినిమా చేయడానికి కారణమేంటో వివరించారు.

Dirty Hari
డర్టీహరి

By

Published : Dec 13, 2020, 6:38 AM IST

Updated : Dec 13, 2020, 7:23 AM IST

"'డర్టీహరి' సినిమాలో చాలా బోల్డ్‌ సన్నివేశాలున్నాయి. అవన్నీ కథకు అనుగుణంగా తగిన మోతాదులోనే ఉంటాయి. యువతే కాదు.. కుటుంబ ప్రేక్షకులూ హాయిగా చూడగలిగేలా ఈ చిత్రం ఉంటుంది" అన్నారు ప్రముఖ దర్శక నిర్మాత ఎం.ఎస్‌.రాజు. మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, వాన వంటి విజయవంతమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన.. కాస్త గ్యాప్‌ తర్వాత ఇప్పుడు డర్టీహరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రవణ్‌ రెడ్డి, సిమ్రత్‌ కౌర్‌, రుహానీ శర్మ నాయకానాయికలుగా నటించారు. ఈనెల 18న ఫ్రైడే మూవీస్‌ ఏటీటీ ద్వారా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు ఎం.ఎస్‌.రాజు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

ఆ సంశయంలోనే..

చిరంజీవి, మహేష్‌బాబు వంటి స్టార్‌ హీరోల దగ్గర నుంచి పెద్ద దర్శక నిర్మాతల వరకు ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదోక దశలో గ్యాప్‌ తీసుకోవాల్సి వస్తుంటుంది. నేనూ అలాగే కొన్నాళ్లు తీసుకున్నా. కాకపోతే కాస్త ఎక్కువ రోజులు ఇంట్లో కూర్చున్నా అంతే. 30ఏళ్ల సినీ కెరీర్‌లో దర్శక నిర్మాతగా ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ప్లాప్‌లతో డీలా పడినప్పుడల్లా అదిరిపోయే హిట్‌లతో మళ్లీ పైకి లేచా. కానీ, తూనీగ తూనీగ తర్వాత ‘దర్శకుడిగా కొనసాగాలా.. నిర్మాతగా ఉండాలా?’ అని సంశయంలో పడ్డా. అలా నన్ను నేను ప్రశ్నించుకుంటూ తెలియకుండానే ఇంత గ్యాప్‌ తీసుకున్నా".

అందుకే ఇలాంటి చిత్రం చేశా..

ఓ దర్శక నిర్మాతగా ఇప్పటి వరకు అన్ని రకాల జోనర్లు ప్రయత్నించా. అలాగే ఓ పూర్తిస్థాయి రొమాంటిక్‌ చిత్రం ఎందుకు చేయకూడదు అనే ప్రయత్నం నుంచి డర్టీహరి చేశా. ఇదేమీ అశ్లీలత నిండిన చిత్రం కాదు.. ఎం.ఎస్‌.రాజు మార్క్‌ చిత్రమే. ప్రపంచం మొత్తాన్ని జేబులో పెట్టేసుకోవాలని తాపత్రయ పడే ఓ సామన్య కుర్రాడు.. తన లక్ష్యం సాధించడం కోసం చుట్టూ ఉన్న వాళ్లని ఎలా వాడుకున్నాడు? అన్నది దీంట్లో చూపించబోతున్నాం. మార్క్‌ కె.రాబిన్‌ సంగీతం, బాల్‌రెడ్డి ఛాయాగ్రహణం సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి’’.

అలా ఏటీటీ వైపు..

థియేటర్లు లక్ష్యంగానే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాం. దీనికి తగ్గట్లుగానే బడ్జెట్‌కు ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కించాం. కరోనా వల్ల మా ప్రణాళికలు తారుమారయ్యాయి. ఇప్పుడు థియేటర్లు తెరచుకున్నా.. కొన్నే ఉన్నాయి. అవీ పరిమిత షోలతోనే నడుస్తున్నాయి. అందుకే మేం ఏటీటీ వైపు అడుగేశాం. ప్రేక్షకుల ఆదరణను బట్టి చిత్రాన్ని థియేటర్లు, మిగతా ఓటీటీల వైపు తీసుకెళ్లే అవకాశముంది.’’

మార్పుని స్వాగతిస్తా..

ప్రస్తుతం నాలుగు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఫ్రైడే మూవీస్‌ కోసం ఓ సినిమా చేద్దామన్నారు. మళ్లీ మా సొంత నిర్మాణ సంస్థ సుమంత్‌ ఆర్ట్స్‌లోనూ సినిమాలు తీయనున్నాం. మంచి కథలతో వస్తే కొత్త వాళ్లని ప్రోత్సహించడానికీ సిద్ధంగానే ఉన్నా.

ఇదీ చూడండి : హరి ఆ ఐదు రూల్స్ ఫాలో అయ్యాడా!

Last Updated : Dec 13, 2020, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details