సినిమాల్లో వెండితెరపై నాయకుడే హీరో.. కానీ, తెరవెనుక నాయకుడు మాత్రం దర్శకుడే. అయితే చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటులు, దర్శకులుగా మారిన సందర్భాలున్నాయి. కానీ, దర్శకులుగా రాణిస్తున్న వారు.. నటులుగా మారడం మాత్రం చాలా అరుదు. చిత్రపరిశ్రమలో దర్శకులుగా గుర్తింపు తెచ్చుకుని.. నటనతోనూ ప్రేక్షకులను మెప్పిస్తున్న వారి గురించి తెలుసుకుందాం.
తరుణ్ భాస్కర్
'పెళ్లిచూపులు' సినిమాతో ఘనవిజయం అందుకున్నారు దర్శకుడు తరుణ్‌భాస్కర్. 'మహానటి', 'ఫలక్‌నూమ దాస్', 'సమ్మోహనం', 'మిడిల్ క్లాస్ మెలొడిస్' చిత్రాల్లో నటుడిగానూ మెప్పించారు. 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో హీరోగానూ నిరూపించుకోనున్నారు. 'పెళ్లిచూపులు'తో విజయ్ దేవరకొండను తరుణ్ హీరోని చేయగా.. ఈ చిత్రానికి విజయ్ నిర్మాతగా వ్యవహరించి.. తరుణ్‌ను హీరోగా చూపించారు.
గౌతమ్ మేనన్
గౌతమ్ మేనన్.. ప్రేమకథలతో యువతరంలో విశేష గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. అయితే ఎప్పుడూ మైక్ పట్టి సినిమాలకు కెప్టెన్‌గా వ్యవహరించే గౌతమ్ మేనన్.. కెరీర్ ప్రారంభం నుంచే కొన్ని అతిథి పాత్రలు చేస్తూ వచ్చారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ 'కనులు కనులను దోచాయంటే' చిత్రంలో కీలకపాత్రలో నటించారు. ఈయన దర్శకుడిగా, నటుడిగానే కాకుండా అనేక చిత్రాలను నిర్మాతగా, సింగర్‌గానూ ప్రేక్షకులను అలరించారు.
ఎస్జే సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ 'వాలీ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు ఎస్జే సూర్య. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో 'ఖుషి' సినిమా హిట్టుతో స్టార్ డైరెక్టర్‌గా మారారు. దర్శకత్వంతో పాటు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ మెరిశారు. తమిళ చిత్రం 'న్యూ'తో కథానాయకుడిగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మహేశ్‌బాబు 'స్పైడర్', విజయ్ 'అదిరింది' సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో సూర్య మెప్పించారు.
సముద్రఖని