లాక్డౌన్లో కొత్త కథలు సిద్ధం చేసే పనిలో పడ్డారు టాలీవుడ్ స్టార్ దర్శకులు. ఈ విరామ సమయంలోనే కొత్త సినిమాలకు సన్నాహాలు చేసేస్తున్నారు. అందులో హరీశ్ శంకర్, పూరీ జగన్నాథ్‌లు ఉన్నారు. వారిద్దరు తెరకెక్కించబోయే కొత్త ప్రాజెక్టుల సంకేతాలను సోషల్‌మీడియాలో తాజాగా అందించారు.
అదే నిర్మాణ సంస్థతో..
'గద్దలకొండ గణేష్' తర్వాత మరోసారి హరీశ్ శంకర్ 14రీల్స్ ప్లస్ పతాకంపై సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. ఆ చిత్రం తర్వాతే 14రీల్స్ ప్లస్ నిర్మించే ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. దీని గురించి ఆ సంస్థ అధినేతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట మాట్లాడుతూ "'గద్దలకొండ గణేష్'తో మంచి విజయం సాధించాం. ఇప్పుడు మరోసారి హరీష్‌తో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్టు కోసం పనిచేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాం" అన్నారు.