తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రామాయణ్' కోసం త్రివిక్రమ్.. నిజమేనా? - త్రివిక్రమ్ వార్తలు

పాన్ ఇండియా 'రామాయణ్' సిరీస్​ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​ కూడా పనిచేయనున్నారట. ప్రస్తుతం హాట్​ టాపిక్​గా ఉన్న ఈ విషయంపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది. దాదాపు రూ.1500 కోట్లతో దీనిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

director Trivikram to be a part of 'Ramayana'
'రామాయణ్' కోసం త్రివిక్రమ్

By

Published : Dec 14, 2020, 9:04 PM IST

Updated : Dec 14, 2020, 9:22 PM IST

భారతీయ సినిమా చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో ఓ భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కబోతోందా..? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. నిజానికి దీనికి మూడేళ్ల కిందటే బీజం పడింది. అప్పట్లో ప్రముఖ సినీ నిర్మాతలు అల్లు అరవింద్‌, నమిత్‌ మల్హోత్రా, మధు మంతెన కలిసి ఓ ప్రాజెక్టు కోసం చేతులు కలిపారు. దాదాపు రూ.1500కోట్ల బడ్జెట్‌తో 'రామాయణ' సిరీస్‌ను తెరకెక్కించాలని నిర్ణయించారు. అయితే.. ఆ విషయంలో మరో ముందడుగు పడ్డట్లు కనిపించకపోయినా.. ఇప్పుడు ఓ వార్త‌ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాలో మాటల మాంత్రికుడు కూడా భాగస్వామ్యం పంచుకోనున్నారట.

అటు వృత్తి పరంగా.. ఇటు వ్యక్తిగతంగానూ అల్లు అరవింద్‌కు సన్నిహితుడైన త్రివిక్రమ్‌.. 'రామాయణ్‌'కు డైలాగ్స్‌ రాయనున్నారట. కాదు కాదు.. ఇప్పటికే రాసేశారట. తన మాటలతో మాయ చేసే త్రివిక్రమ్‌ను ఈ సినిమాకు ఎలాగైనా డైలాగులు రాయాల్సిందేనని చిత్రబృందం పట్టుబట్టిందట. భారతీయ సినీ చరిత్రలోనే భారీ ప్రాజెక్టు.. పైగా అల్లు అరవింద్‌ కూడా నిర్మాత.. అన్నింటికంటే ముఖ్యంగా రామాయణంలాంటి గొప్ప సినిమాకు మాటలు రాసే ఛాన్స్‌ వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి..? అందుకే అందుకే త్రివిక్రమ్‌ కూడా పచ్చజెండా ఊపేశారట. అంతేకాదు. లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని.. డైలాగులు పూర్తి చేశారట. అలా రామాయణ్‌ సినిమా స్క్రీన్‌ప్లేలో త్రివిక్రమ్‌ తన పేరును చేర్చారట. అంతేకాదు.. తెలుగులో ఆయన రాసిన డైలాగుల్ని బట్టి హిందీ, తమిళం వెర్షన్‌లు తెరకెక్కించనున్నారట. ఆయన మొత్తం మూడు గంటల సినిమాకు సరిపోయే మెటీరియల్‌ను సినిమా బృందానికి అప్పగించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాను మూడు భాగాలుగా తీయాలని అప్పట్లో నిర్మాతల బృందం ప్రకటించారు.

'దంగల్' దర్శకుడు నితీష్‌ తివారి, 'మామ్' రవి ఉద్యావర్‌ సంయుక్తంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది.

ఈ సినిమాలో తారాగణంపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. అయితే.. పాన్‌ ఇండియాగా తెరకెక్కనున్న నేపథ్యంలో వేర్వేరు చిత్ర పరిశ్రమలను నుంచి నటీనటులను ఎంపిక చేసే అవకాశం ఉంది. నిజానికి 2021లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్‌ చేసినా.. కరోనా వల్ల పనులు కూడా ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకో విషయం.. దీన్ని '3డీ'లో చిత్రీకరించనున్నారట.

Last Updated : Dec 14, 2020, 9:22 PM IST

ABOUT THE AUTHOR

...view details