కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పర్యావరణాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటాలని కోరారు. గాయకుడు రాహుల్ విసిరిన హరిత సవాల్‌ను స్వీకరించిన తరుణ్.. బంజారాహిల్స్‌లోని నివాసంలో తన తల్లితో కలిసి మొక్కలు నాటారు. ఈ హరిత ఉద్యమంలో పాలుపంచుకోవాల్సిందిగా నటుడు విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, అభయ్‌లకు సవాల్ చేశారు.
'ఇలాంటప్పుడే పర్యావరణం కాపాడుకోవడం ముఖ్యం' - దర్శకుడు తరుణ్ భాస్కర్ వార్తలు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న దర్శకుడు తరుణ్ భాస్కర్.. పర్యావరణం కాపాడుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. విజయ్ దేవరకొండ, రీతూవర్మ, అభయ్‌లకు ఈ సవాలును విసిరారు.
!['ఇలాంటప్పుడే పర్యావరణం కాపాడుకోవడం ముఖ్యం' 'ఇలాంటప్పుడే పర్యావరణం కాపాడుకోవడం ముఖ్యం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7716718-54-7716718-1592791102141.jpg)
దర్శకుడు తరుణ్ భాస్కర్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో దర్శకుడు తరుణ్ భాస్కర్