తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. సెలబ్రిటీలు సైతం దీని బారిన పడుతున్నారు. ఇటీవల అగ్ర దర్శకుడు రాజమౌళి కుటుంబానికి కరోనా సోకినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు మరో డైరెక్టర్ తేజకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల ముంబయి వెళ్లి వచ్చిన ఆయన.. ఆ తర్వాత పరీక్షలు చేయించుకోగా, వైరస్ సోకినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.
కరోనా బారినపడ్డ దర్శకుడు తేజ - rajamouli coorna
టాలీవుడ్లో మరో దర్శకుడికి కరోనా సోకింది. ఇటీవలే ముంబయి వెళ్లి వచ్చిన తేజకు పాజిటివ్‌గా తేలింది. ఆయన కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్ వచ్చింది.
దర్శకుడు తేజ
తేజ ఇప్పటికే తన తర్వాతి చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. గోపీచంద్, రానాలతో వేర్వేరుగా సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్‌లు చేసే పరిస్థితి లేకపోవడం వల్ల ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టారు.