తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ 'చిత్రం'తో దర్శకుడు తేజ తనయుడు ఎంట్రీ! - Director Teja introduces his son

యూత్​ఫుల్ ఎంటర్​టైనర్​ 'చిత్రం' సీక్వెల్​తో దర్శకుడు తేజ.. తన కుమారుడిని హీరోగా పరిచయం చేయనున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

teja
తేజ

By

Published : Apr 7, 2021, 5:01 PM IST

తన సినిమాలతో ఎంతోమంది కొత్తవారిని టాలీవుడ్​కు పరిచయం చేసిన తేజ.. ప్రముఖ దర్శకుడిగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా 'నేనే రాజు నేనే మంత్రి'తో హిట్​ కొట్టిన ఆయన.. తన తొలి సినిమా 'చిత్రం'కు సీక్వెల్​గా.. 'చిత్రం 1.1' ఉంటుందని ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాతో తన కుమారుడు అమితవ్​​ తేజ్​ను హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం అమితవ్​ విదేశాల్లో శిక్షణ కూడా తీసుకున్నాడని తెలిసింది.

చిత్రం

ఈ నెల 18న సినిమా షూటింగ్​ ప్రారంభంకానున్నట్లు వినికిడి. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది. దీని తర్వాత తేజ.. హీరోలు రానా, గోపీచంద్​తో వేర్వేరుగా చిత్రాలు చేయనున్నారు.

స్వతహాగా కెమెరామెన్ అయిన తేజ.. 2000లో 'చిత్రం'తో డైరెక్టర్​గా మారారు. ఉదయ్ కిరణ్, రీమాసేన్​లను హీరోహీరోయిన్లుగా, ఆర్పీ పట్నాయక్​ను సంగీత దర్శకుడిగా ఈ సినిమాతోనే పరిచయం చేశారు.

ఇదీ చూడండి: 20 ఏళ్ల తర్వాత 'చిత్రం'కు సీక్వెల్.. తేజ ప్రకటన

ABOUT THE AUTHOR

...view details