తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రంగస్థలం' కాంబో రిపీట్.. చరణ్​తో సుకుమార్ మరో సినిమా - allu arjun sukumar movies

Sukumar ram charan movie: 'రంగస్థలం' కాంబినేషన్​ మరోసారి రిపీట్ కానుంది. ఈ విషయాన్ని సుకుమార్ కన్ఫర్మ్ చేశారు. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు మొదలు కానుందంటే?

Sukumar ram charan movie
సుకుమార్ రామ్​చరణ్

By

Published : Dec 23, 2021, 4:57 PM IST

Sukumar Pushpa movie: 'పుష్ప'తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన సుకుమార్.. 'పుష్ప' పార్ట్-2 ప్రీ ప్రొడక్షన్​తో బిజీగా ఉన్నారు. 'పుష్ప' పూర్తయిన తర్వాత ఏ హీరోలతో సినిమాలు చేస్తారు? 'పుష్ప' చిత్రానికి అసలు ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇతరత్రా ఆసక్తికర విషయాల్ని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సుకుమార్ వెల్లడించారు.

Sukumar vijay devarakonda movie: "పుష్ప' తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాను. ఆ తర్వాత రామ్​చరణ్​తో ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా చర్చల దశలోనే ఉంది" అనే ఇంట్రస్టింగ్ న్యూస్​ సుకుమార్ చెప్పారు. ఇంతకు ముందు చరణ్​తో 'రంగస్థలం' లాంటి బ్లాక్​బస్టర్​ సినిమా తీశారు సుకుమార్.

సుకుమార్​తో రామ్​చరణ్

"ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి నేను పరిశోధన చేసినప్పుడు నాకు చాలా విషయాలు తెలిశాయి. దాదాపు లక్ష 80 వేల కోట్ల విలువైన సరుకు చైనా, జపాన్​లకు స్మగ్లింగ్ అవుతుంది. అయితే దీని ఆధారంగా ఓ వెబ్ సిరీస్​ తీయాలనుకున్నాను. కానీ ఇంతమంచి కథను కమర్షియల్​ బ్యాక్​డ్రాప్​తో సినిమాగా తీస్తే బాగుంటుందని అనిపించింది. అలా 'పుష్ప' మొదలైంది" అని సుక్కు చెప్పారు.

"అయితే మొదట ఒకే సినిమాగా తీయాలనుకున్నాను. కానీ ఒకానొక టైమ్​లో దీని రెండు పార్ట్​లుగా మార్చాలని నిర్ణయించుకున్నాను. నేను దాదాపు 30 ఏళ్లు పల్లెటూరిలో ఉన్నాను. దాంతో చాలామంది విభిన్నమైన వ్యక్తుల్ని చూశాను. 'రంగస్థలం' తర్వాత అందుకే విలేజ్​ బ్యాక్​డ్రాప్​తో మరో సినిమా తీయాలని భావించాను. అయితే 'రంగస్థలం', 'పుష్ప' సినిమా రెండు పూర్తిగా డిఫరెంట్" అని సుకుమార్ స్పష్టం చేశారు.

సుకుమార్ విజయ్ దేవరకొండ మూవీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details