శర్వానంద్ కథానాయకుడిగా ఫుల్ లెంగ్త్ యాక్షన్ నేపథ్యంలో వస్తోన్న చిత్రం 'రణరంగం'. యువ దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ఈ మూవీ విడుదలవుతోంది.
'దళపతి' కుదరక 'రణరంగం' చేశాం: సుధీర్ - sudheer verma
శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం 'రణరంగం'. ఈ సినిమాకు మొదట 'దళపతి' అనే టైటిల్ పెడదామని అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదని దర్శకుడు సుధీర్ వర్మ తెలిపాడు.
ఈ సినిమాకు మొదట 'దళపతి' అనే టైటిల్ పెడదామనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల అది సాధ్యమవలేదట. ఏ పేరు పెట్టాలి? అనే సందేహంలో ఉన్నప్పుడు ఈ చిత్ర నిర్మాత నాగ వంశీ 'రణరంగం' అనే పేరు చెప్పాడట. "సౌండింగ్ బావుంది ఇదే ఖరారు చేసేద్దాం" అని అన్నాడట దర్శకుడు సుధీర్ వర్మ. అలా ఈ యాక్షన్ మూవీకి 'రణరంగం' కుదిరింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో కాజల్, కల్యాణి ప్రియదర్శిన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచుతున్నాయి.
ఇవీ చూడండి.. త్వరలోనే పెళ్లి పీటలపైకి 'రాక్షసుడు' శీను