ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'తో టాలీవుడ్ స్థాయిని పెంచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. తన తొలి సినిమా 'స్టూడెంట్ నెం.1' విడుదలై నేటికి(శుక్రవారం) 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ఈ డైరక్టర్.. ఓ ఆసక్తికర ఫొటోను పంచుకున్నాడు. ఆ సినిమా సెట్లో జూ.ఎన్టీఆర్తో ఉన్నప్పుడు, ప్రస్తుతం అతడితో ఉన్న ఫొటోను కలిపి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు.
" స్టూడెంట్ నెం.1 విడుదలై నేటికి 18 ఏళ్లు!!. కాకతాళీయంగా మేం ఇప్పుడు రామోజీఫిల్మ్ సిటీలోనే ఉన్నాం. ఎంతో మారింది. అతడు(జూ.ఎన్టీఆర్) సన్నగా మారాడు. నాకు వయసు పెరిగింది. ఇద్దరి తెలివితేటలు మెరుగయ్యాయి". -ఎస్.ఎస్.రాజమౌళి, దర్శకుడు