RRR Songs: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం రణం రుధిరం)'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 7న (RRR Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా నవంబర్ 26న 'జనని' అనే పాట విడుదల చేయనుంది. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ఈ పాటను గురువారం ఉదయం 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్.. విలేకర్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించింది. పాట విడుదల కార్యక్రమంలో రాజమౌళి, నిర్మాత దానయ్య పాల్గొన్నారు. "నటీనటులు, మెయిన్ టెక్నీషియన్స్.. ఇలా 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ మొత్తం త్వరలోనే మీ ముందుకు వస్తాం. మీ ప్రశ్నలన్నింటికీ మేము సమాధానం చెబుతాం" అని రాజమౌళి ఈ సందర్భంగా తెలిపారు.
ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతా: రాజమౌళి - NTR RRR
ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్న ఆర్ఆర్ఆర్లోని 'జనని' పాటను నవంబర్ 26న విడుదల చేయనుంది చిత్రబృందం. అయితే ఆలోపే మీడియాకు ఆ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి (SS Rajamouli RRR) కీలక వ్యాఖ్యలు చేశారు.
బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. రామ్‌చరణ్-తారక్ మొదటిసారి ఈ సినిమా కోసం స్క్రీన్ పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ.. కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియాభట్, ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండు పాటలు (rrr songs) ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో విడుదల కానున్న 'జనని' పాటపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఇదీ చూడండి:RRR song update: మరో పాట రిలీజ్‌కు రెడీ