జక్కన్నకు 'భీమ్', 'సీతారామరాజు' స్పెషల్ విషెస్ - ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్
దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. 'ఆర్ఆర్ఆర్' హీరలు రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ స్పెషల్‌గా ట్వీట్ చేశారు.
దర్శకధీరుడు రాజమౌళి శుక్రవారం తన 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ ఓ స్పెషల్ పిక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో భాగంగా జక్కన్నతో కలిసి దిగిన ఓ ఫొటోని షేర్ చేసిన తారక్.. ‘హ్యాపీ బర్త్‌డే జక్కన్న!! లవ్ యూ’ అని ట్వీట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్‌మీడియా వేదికగా రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
- 'విమర్శలకు బలం ఎక్కువ, కానీ ఆయన విజయానికి ఇంకా బలం ఎక్కువ. హ్యాపీ బర్త్‌డే టూ మై మెంటర్ రాజమౌళి గారు' -రామ్‌చరణ్, కథానాయకుడు
- 'ప్రియమైన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో నటిస్తున్నందుకు నేనెంతో గౌరవంగా భావిస్తున్నాను' - అజయ్ దేవగణ్
- 'హ్యాపీ బర్త్‌డే రాజమౌళి సర్. మీ చిత్రాలతో మరెన్నో గొప్ప విజయాలను అందుకోవాలని, తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరెంతో పెంచాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను' - మహేశ్‌బాబు
- 'భారతదేశంలో ఉన్న అత్యున్నతమైన దర్శకుల్లో ఒకరైన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు' -వెంకటేశ్
- 'జన్మదిన శుభాకాంక్షలు రాజమౌళి సర్. మీరు ఇలాగే గొప్ప సంకల్పంతో మీ కలలను సాకారం చేసుకుని అద్భుతమైన విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు మీకు ఆయురారోగ్యాలు అందించాలని ప్రార్థిస్తున్నాను. అక్టోబర్ 22 (కొమరం భీమ్ స్పెషల్) కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న' - బాబీ
- 'హ్యాపీ బర్త్‌డే రాజమౌళి సర్. మీరు మరెన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించాలని భావిస్తున్నాను. మున్ముందు మీతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ ఏడాదిలో మిమ్మల్ని మరెన్నోసార్లు కలవాలని కోరుకుంటున్నాను' - కాజల్
- 'డియర్ రాజమౌళి సర్.. ఫిల్మ్ స్కూలింగ్‌లో భాగంగా నేను శాన్ ఫ్రాన్సిస్‌కో స్టేట్ యూనివర్సిటీకి వెళ్లాను. ఆతర్వాత 'బాహుబలి' సినిమా వల్లే అక్కడికి మరోసారి వెళ్లగలిగాను. మనం చేసే పనిలో విజయాలు సాధించాలంటే.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అస్సలు రాజీ పడొద్దనే విషయాన్ని నేను మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. హ్యాపీ బర్త్‌డే సర్. 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా కోసం ఎదురుచూస్తున్నా’ - అడివి శేష్
- 'చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ వ్యక్తి, లెజండరీ డైరెక్టర్ రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు. మరెన్నో విజయాలతో మీ సినీ ప్రయాణం చారిత్రాత్మకంగా సాగాలని కోరుకుంటున్నాం' - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
- 'భారతీయ చలన చిత్ర పరిశ్రమకు బాహుబలిగా పేరుపొందిన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు' - ఆది