'కొత్తబంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ముకుంద' వంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత తీసిన 'బ్రహ్మోత్సవం' సినిమా ఆయనకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఒక్క చిత్ర ఫలితంతో వరుస విజయలందుకున్న శ్రీకాంత్.. మళ్లీ సినిమా చేజిక్కించుకోవడానికి మూడేళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం 'అసురన్' తెలుగు రీమేక్‌కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.
తాజాగాఈ సినిమాకు శ్రీకాంత్ అందుకోబోతున్న పారితోషికానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ మూవీని తెరకెక్కించేందుకు శ్రీకాంత్‌కు నెలకు రూ.2 నుంచి 3 లక్షల మధ్య పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.