తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Mahasamudram Latest News: భావోద్వేగాల ప్రయాణం 'మహా సముద్రం' - మహాసముద్రం సినిమా రిలీజ్

"భావోద్వేగాల ప్రయాణం మా 'మహా సముద్రం"(Mahasamudram Latest News) అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి. తన మొదటి చిత్రం 'ఆర్‌.ఎక్స్‌.100'కు మించి ఈ సినిమా ఉంటుందన్నారు.

mahasamudram
మహా సముద్రం

By

Published : Sep 24, 2021, 6:54 AM IST

తెలుగు తెరపై ఎప్పుడూ చూడని భావోద్వేగాలతో 'మహా సముద్రం'(Mahasamudram Latest News) సినిమా తెరకెక్కిందన్నారు అజయ్‌ భూపతి. ఆయన దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులుగా నటించారు. అను ఇమ్మానుయేల్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు అజయ్​ భూపతి మాట్లాడారు.

"భావోద్వేగాల ప్రయాణం ఈ సినిమా. ఓపెన్‌ డ్రామాతో కూడిన ఓ ప్రేమకథ. యాక్షన్‌ సమ్మేళనంగా రూపొందింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా ప్రతిదీ పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఇవన్నీ కాకుండా మంచి సంగీతం, మంచి కెమెరా పనితనం కనిపిస్తుంది. విశాఖ చరిత్రలో ఎక్కువ రోజులు చిత్రీకరించిన సినిమా ఇదే. ఇందులోని ప్రతి పాత్ర మన చుట్టూ కనిపించే పాత్రల్లాగే ఉంటాయి. నేను చేసిన 'ఆర్‌.ఎక్స్‌.100' గురించి దేశం మొత్తం తెలుసు. అంతకుమించి ఉంటుందీ చిత్రం. ఇద్దరు హీరోల్ని సెట్‌ చేయడం కష్టమైంది. చాలా క్లిష్టమైన పాత్రలు ఇందులో ఉంటాయి. శర్వానంద్‌, సిద్ధార్థ్‌, నిర్మాత అనిల్‌ సుంకర ఇచ్చిన సహకారంతో నేను స్వేచ్ఛగా సినిమా తీయగలిగా. నా దృష్టిలో 'మహాసముద్రం' బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించినట్టే."

-- అజయ్ భూపతి, దర్శకుడు

శర్వానంద్‌ మాట్లాడుతూ "ప్రేమలో హింస ఉంటుంది. ట్రైలర్‌లో యాక్షన్‌ కనిపిస్తున్నా.. అందరికీ నచ్చే భావోద్వేగాలు ఇందులో ఉంటాయి" అన్నారు. ఈ చిత్రం అక్టోబరు 14న(mahasamudram release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో అను ఇమ్మానుయేల్‌, సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌, ఛాయాగ్రాహకుడు రాజ్‌ తోట పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'సాయి పల్లవితో చేసేందుకు చాలా టేక్​లు తీసుకున్నా'

ABOUT THE AUTHOR

...view details